రెండో రోజు శాసనసభకు 5, పార్లమెంట్‌కు 2 నామినేషన్లు | Sakshi
Sakshi News home page

రెండో రోజు శాసనసభకు 5, పార్లమెంట్‌కు 2 నామినేషన్లు

Published Sat, Apr 20 2024 3:20 AM

-

కాకినాడ సిటీ: జిల్లాలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఐదు, కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ శుక్రవారం తెలిపారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) రెండు సెట్లు, కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఒక సెట్‌, ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్‌ సీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఒక సెట్‌, తుని నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా లాలం లోవరాజు రెండు సెట్లు, జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకట అప్పారావు అనే నెహ్రూ ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నివాస్‌ వివరించారు. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి భారత చైతన్య యువజన పార్టీకి చెందిన అనుష చందక, స్వతంత్ర అభ్యర్థిగా గిడ్ల సింహాచలం ఒక్కొక్క సెట్‌ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు రెండు రోజులుగా ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో తొమ్మిది నామినేషన్లు దాఖలు కాగా పార్లమెంట్‌ నియోజక వర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Advertisement
Advertisement