108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి
కాకినాడ సిటీ: ప్రభుత్వమే 108 వ్యవస్థను నేరుగా నిర్వహించాలని, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్లతో 108 ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద సోమవా రం ఒక రోజు రిలే నిరాహార దీక్ష, ధర్నా నిర్వహించారు. 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూని యన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి జి.జయరాం, అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ ప్రసంగించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా 108 నిర్వహణ కాంట్రాక్టర్లను మార్చడంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఎగ్గొడుతున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నూరు శాతం నిధులు ప్రభుత్వాలే చెల్లిస్తున్నప్పుడు దళారీలను కమీషన్ల కోసమే ఉంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ నాయకులు సుధాకర్, వరప్రసాద్, తాతాబ్బాయి, నాగేంద్ర, సత్యనారాయణ, ప్రియాంక, సుందరమణి దీక్షలో కూర్చున్నారు. వారికి పలువురు 108 ఉద్యోగులు మద్దతు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 నామినేషన్లు
కాకినాడ సిటీ: పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఏడో రోజైన సోమవారం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు వద్ద వారు నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెంకటరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment