సైబర్ నేరాల నియంత్రణకు సహకరించండి
కాకినాడ క్రైం: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాల నియంత్రణలో పోలీసు శాఖకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్నాళ్లుగా ఆర్థిక లావాదేవీల్లో సైబర్ నేరగాళ్ల చొరబాట్లు ఎక్కువయ్యాయన్నారు. అనేక మంది బాధితులు సైబర్ నేరాల బారిన పడి తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని చెప్పారు. ఈ తరహా నేరాలను కట్టడి చేసేందుకు అవసరమైన అధునాతన సాంకేతికత మరిన్ని సమర్థవంతమైన ప్రయోజనాలతో అందుబాటులోకి రానున్నదని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ నేరగాళ్ల ఆట కట్టించి, బాధితులను రక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీలకు కట్టుదిట్టమైన భద్రతను ఇవ్వాలని సూచించారు. అనుమానిత లావాదేవీలపై తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ పాటిల్ సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment