కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మంచి మార్గాన్ని ఎన్నుకోవడంతో పాటు మన ఆరోగ్యం.. మన హక్కు అనే విధంగా జీవించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాలులో ఎయిడ్స్ బాధిత బాలబాలికలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా నివ్వడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపవచ్చన్నారు. అపోహలు, ఊహాగానాలకు తావులేకుండా క్రమం తప్పకుండా మందులు వేసుకొని, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ఇతర అఽధికారులు పాల్గొని బాలలతో సహపంక్తి భోజనం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ ర్యాలీ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి పీఆర్ కళాశాల మీదుగా బాలాజీ చెరువు సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఎయిడ్స్ అనేది అవగాహనతోనే అఅంతమవుతుందన్నారు. ర్యాలీలో రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ వైడీ రామారావు, సెట్రాజ్ సీఈవో కాశీ విశ్వేశ్వరరావు, వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగస్తులకు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్, జేసీ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ రమేష్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎన్ స్వప్న, జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్‌రావు, ఓఎన్‌జీసీ సంస్థ జీఎం సునీల్ కుమార్, రిలయన్స్ సంస్థ డీజీఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
01కెకెడి103:
సమావేశంలో మాట్లాడుతున్న
కలెక్టర్ షణ్మోహన్
Comments
Please login to add a commentAdd a comment