ప్రత్తిపాడు కోఆర్డినేటర్ గిరిబాబు
● రెండు దశాబ్దాల తరువాత రాజకీయాల్లోకి ముద్రగడ కుటుంబం రీ ఎంట్రీ
● నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్న యువనేత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఈ మేరకు మంగళవారం గిరిబాబుకు పార్టీ సమన్వయకర్తగా నియామక ఉత్తర్వులు జారీచేసింది. గిరిబాబు హైదరాబాద్, భీమవరంలలో ప్రాథమిక, ఉన్నత విద్య, చైన్నెలో ఇంజినీరింగ్ చదువుకుని ఉన్నత విద్య ఎంఎస్ లండన్‌లో పూర్తిచేశారు. అనంతరం ఢిల్లీలో సివిల్స్‌కు కోచింగ్ తీసుకుంటున్న సమయంలో సోదరుడు బాలుకు ఆరోగ్య సమస్య ఏర్పడడంతో స్వగ్రామం కిర్లంపూడి తిరిగొచ్చారు. అప్పటి నుంచి తండ్రి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తోడుగా ఉంటున్నారు. తాత వీరరాఘవరావు, తదనంతరం తండ్రి ముద్రగడ పద్మనాభం నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న గిరిబాబు ఇటీవల ప్రత్తిపాడులో వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి తాత వీరరాఘవరావు ఒక పర్యాయం, తండ్రి పద్మనాభం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే, రెండు పర్యాయాలు మంత్రి, 1999–2004 వరకు కాకినాడ ఎంపీగా పనిచేశారు. రెండు దశాబ్దాల తరువాత ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాల్లో ముద్రగడ కుటుంబం నుంచి మూడో తరం నేతగా గిరిబాబు రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన దగ్గర నుంచి పద్మనాభంతో పాటు అతని వెంట తనయుడు గిరిబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గిరిబాబును ప్రత్తిపాడు కోఆర్డినేటర్‌గా జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన కోఆర్డినేటర్ బాధ్యతలతో పార్టీ పూర్వవైభవానికి శక్తివంచన లేకుండా తండ్రి, పార్టీ నేతల సహకారాలతో కృషిచేస్తానన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment