వైభవంగా కోటి దీపోత్సవం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలా త్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం జరిగింది. కార్తిక మాసం ముగింపు రోజున అమావాస్యను పురస్కరించుకొని ప్రతీ ఏడాది పంచారామ క్షేత్రంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రి పంచారామ క్షేత్రంలోని ఉప ఆలయమైన గణపతి ఆలయంలో ఈఓ భళ్ల నీలకంఠం, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబులు పూజలు చేసి దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించా రు. ఆలయ దీపారాధన సంఘ సభ్యులు ఆలయం అంతా దీపాలతో నింపారు. భక్తులు దీపాల వద్ద వేచి ఉండి ఆలయ దీపారాధన సంఘ సభ్యులు ఆరు గంటలకు గంట మోగించిన వెంటనే భక్తులు ఒకేసారి హర హర మహేదేవ శంబోశంకరా అంటూ దీపాలను వెలిగించారు. ఆలయంలోని మొదటి అంతస్తు, దిగు వ భాగంలోని స్తంభాలు, ఆలయ గోడల చుట్టూ దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోను భక్తు లు దీపాలు వెలిగించడంతో అడుగు తీసి అడుగు వే యడానికి వీలు లేని విధంగా ఆలయం దీపాలు, భక్తులతో నిండిపోయింది. భక్తులు 365 ఒత్తుల నుంచి 1000 ఒత్తుల వరకు దీపాలు ఏర్పాటు చేసుకొని వెలి గించారు. ఆలయం అంతా దీపారాధన సంఘ సభ్యు లు దీపాలు ఏర్పాటు చేశారు. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment