ఘనంగా దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు
పిఠాపురం: దత్తాత్రేయుని అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభస్వామి జన్మస్థలమైన పిఠాపురంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో స్వామివారికి రెండో రోజైన సోమవారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు పాదగయ క్షేత్రంలో కూడా దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి అర్చకులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రెండు ఆలయాల్లోనూ స్వామివార్లను వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు.
రెండేళ్ల క్రితం బెంగాల్ టైగర్ సంచారం
మండలంలోని ఒమ్మంగిలో 2022 మే 24న ఓ పులి.. గేదైపె దాడి చేసి హతమార్చింది. అప్పుడు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పులి ఆచూకీ లభించింది. దానిని బెంగాల్ టైగర్‌గా అధికారులు గుర్తించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు రక్షణ కల్పిస్తూ, పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అటవీ అధికారులు రేయింబవళ్లనే తేడా లేకుండా 40 రోజుల పాటు పడరాని పాట్లు పడ్డారు. అప్పట్లో ప్రజలు, అటవీ అధికారులను బెంగాల్ టైగర్ ముప్పుతిప్పలు పెట్టింది. ప్రస్తుతం అదే బెంగాల్ టైగర్ అప్పట్లో ఏర్పాటు చేసుకున్న కారిడార్ ద్వారా తిరిగి ఈ ప్రాంతానికి వచ్చిందనే అనుమానం స్థానికంగా వ్యక్తమవుతోంది. ట్రాప్ కెమెరాలకు చిక్కితేనే అది గతంలో వచ్చిన బెంగాల్ టైగరా లేక మరో పులా అనేది నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం అటవీ అధికారులు పులి ఆచూకీ కోసం ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్ అధికారి దుర్గా రాంప్రసాద్, డీఆర్‌ఓ జాన్సన్, ఫారెస్టు బీట్ అధికారి సురేష్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రెండేళ్ల క్రితం ఫారెస్టు అధికారులు గుర్తించిన
బెంగాల్ టైగర్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment