అన్నవరం: సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు నీడ కల్పించే లక్ష్యంతో విశ్రాంతి షెడ్ల నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై మొదటి ఘాట్ రోడ్డు వద్ద రూ.60 లక్షలు, తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షల వ్యయంతో రాజమండ్రి పేపర్ మిల్లు యాజమాన్యం సహకారంతో ఈ షెడ్లు నిర్మిస్తున్నారు. వారం రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ సోమవారం తెలిపారు. కాగా, పశ్చిమ రాజగోపురం ఎదురుగా రూ.88 లక్షల వ్యయంతో మరో షెడ్డు నిర్మాణానికి కూడా దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. త్వరలో దీని నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment