నేతలేమన్నారంటే..
ఫ ఓటమి ఒంటరి వంటిది. అదే విజయానికి బంధువులు ఎక్కువ. ఓటమితో కోల్పోయిన మనోధైర్యాన్ని పార్టీ శ్రేణుల్లో తిరిగి కల్పించే లక్ష్యంతో నాయకులు ముందుకు సాగాలి. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేసిన కూటమి సర్కార్‌పై ప్రజాపోరాటాలు తప్పవు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు
ఫ పార్టీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు అందరూ కలసికట్టుగా ఉండాలి.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్
ఫ పోరాటాలు చేయని పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయనే విషయాన్ని చరిత్ర చెబుతోంది. నిత్య పోరాటాలతోనే నాయకత్వం బలపడుతుంది.
– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ
ఫ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్,
వైఎస్సార్ సీపీ పి.గన్నవరం
కో ఆర్డినేటర్
ఫ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి దళితులు, వైఎస్సార్ అభిమానులను వేధిస్తున్న కూటమి సర్కార్‌కు షాక్ ఇవ్వాలి.
– బొమ్మి ఇజ్రాయిల్,
ఎమ్మెల్సీ
ఫ జగన్‌కు ఆయాచితంగా ముఖ్యమంత్రి పదవి రాలేదు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రబలమైన శక్తిని ఎదురొడ్డి పోరాడి, సొంతంగా పార్టీ పెట్టి, సీఎం అయ్యారు. కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పోరాటాలతోనే విజయాలు సాధించాలి. – తోట త్రిమూర్తులు,
ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట కో ఆర్డినేటర్
ఫ సంస్థా గతంగా పార్టీని మరింత బలోపేతం చేసుకునేలా కలిసికట్టుగా ముందడుగు వేసి, కులం, మతం చూడకుండా సంక్షేమాన్ని అందించిన జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలి.
– వంగా గీత (మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం కో ఆర్డినేటర్), మాజీ ఎంపీ చింతా అనురాధ
ఫ కూటమి సర్కార్ 6నెలల పా లనలో ఆశలు ఆవిరైపోయి, ప్రజ ల్లో అంతర్మథనం మొదలైంది.
– పొన్నాడ వెంకట సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం కో ఆర్డినేటర్
ఫ వైఎస్సార్ సీపీకి వచ్చిన 40 శాతం ఓట్లను తక్కువగా అంచనా వేయవద్దు.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్
ఫ పదేళ్లు పోరాటం చేసి అధికారంలోకి వచ్చాం. డైనమిక్ లీడర్ బొత్స నాయకత్వంలో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారనే నమ్మకం ఉంది. – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో ఆర్డినేటర్
ఫ ఆరు నెలలుగా కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, రైతుల బాధలు, దళితులకు ఉచిత వి ద్యుత్ తొలగింపు వంటి వాటిపై చేసే పోరాటాల్లో మనమంతా ముందుండాలి. –ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి
సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. వేదికపై మూడు జిల్లాల పార్టీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment