వీరికి ఎన్నికల కోడ్ వర్తించదా?
ఫ పిఠాపురంలో టీడీపీ హైడ్రామా
ఫ కౌంటింగ్ రోజునే ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఫ పట్టించుకోని అధికారులు
పిఠాపురం: పట్టణంలో టీడీపీ నేతలకు చట్టం చుట్టంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. 144 సెక్షన్ సైతం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అటువంటిదేమీ లేకుండానే టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సోమవారం పిఠాపురంలో యథేచ్ఛగా సవాళ్లు విసురుతూ, టీడీపీ జెండాలతో పట్టణ వీధుల్లో ప్రదర్శన, ఉప్పాడ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. కాకినాడ సెజ్ భూములకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేతలు చర్చకు రావాలంటూ ఈ సమావేశంలో సవాళ్లు విసిరారు. ఒకపక్క కాకినాడలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అయినప్పటికీ పిఠాపురంలో ఎన్నికల కోడ్‌ను టీడీపీ నేతలు తుంగలో తొక్కినా అధికారులు, పోలీసులు పట్టించుకోకపోగా బందోబస్తు నిర్వహించడమేమిటని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై ఎ న్నికల సంఘం స్పందించి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి న వారిపైన, వారిని నిలువరించడంలో విఫలమైన అఽ దికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి కొండలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్ కస్టమర్ కేర్, నాన్‌వాయిస్ కంప్యూటర్ బేసిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎనిమిదో తరగతి ఆ పైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 90107 37998 నంబరులో సంప్రదింవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment