గల్లా పెట్టె నిండటం లేదు
బోయనపూడి రోడ్డు శివారున మోడ్రన్ రైస్ మిల్లు ఉంది. చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల వారికి అదొక్కటే మిల్లు. ఇందులో ధాన్యం, అటుకులు, పిండి, నూక, ఆయిల్ మర పడతారు. చాలా ఏళ్లుగా ఆ మిల్లు నడుపుతున్న రేలంగి రాంబాబు, వెంకటలక్ష్మిలను మిల్లు ఎలా నడుస్తోందని సాక్షి పలకరించింది. ‘గత ఏడాది సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే మిల్లు కిక్కిరిసిపోయి ఉండేది. అసలు ధాన్యం బస్తాలు మర పట్టడానికి కూడా సమయం లేక పక్కన పెట్టేసే వాళ్లం. పండగ పిండి వంటలకు మాత్రమే సరకులు మర ఆడేవాళ్లం. గత ఏడాది సంక్రాంతికి అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, మహిళా సంఘాలకు వడ్డీ రాయితీతో పాటు ప్రభుత్వం అందించిన సొమ్ము జనం వద్ద ఆడేది. అప్పట్లో వంట చేసుకోవడానికి ఇంటికి వెళ్లే తీరిక కూడా లేక మిల్లులోనే ఉండిపోయే వాళ్లం. ఈసారి సంక్రాంతికి వారం ముందు నుంచి రోజుకు నలుగురైదుగురికి మించి మిల్లుకు రావడం లేదు. అప్పట్లో అరగంట మిల్లు ఆడేసరికి గల్లా పెట్టె నిండిపోయేది.
ఇప్పుడు అందులో సగం కూడా నిండటం లేదు. ఇంక సంక్రాంతి ఎలా ఉంటుంది?’ అని పెదవి విరిచారు. ‘నిజంగా చెప్పాలంటే ఆ రోజులే వేరులెండి’అని వెంకటలక్ష్మి అన్నారు. ‘అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచేది లేదని చంద్రబాబు చెప్తే నిజమని నమ్మాం. తీరా గతంతో బిల్లులు పోల్చి చూస్తే గుండె గుభేల్‌మంటోంది’ అని మిల్లు యజమాని రేలంగి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత విద్యుత్ బిల్లు రూ.4,500 వస్తే ఈ నెలలో రూ.6 వేలు దాటేసిందని, ఇలాగైతే మిల్లు నడపడమే కష్టమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment