No Headline
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామర్లకోట మండలంలోని చిన్న గ్రామ పంచాయతీ వీకే రాయపురం. సంక్రాంతి పండగ శోభతో ఇప్పటికే ఈ గ్రామం కళకళలాడాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామంలో ఆ కళ ఎక్కడా కానరావడం లేదు. పండగంటే ఉరకలెత్తే ఉత్సాహం.. కేరింతలు కనిపించడం లేదు. వీకే రాయపురంలోని నాలుగు వీధుల్లో సాక్షి ఆదివారం మూడు గంటల పాటు నిర్వహించిన ‘విలేజ్ విజిట్’ సందర్భంగా గ్రామంలో ఎవరిని కదిపినా ఆరు నెలల్లో ఎంత మార్పు వచ్చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారే కనిపించారు. శ్రీసాక్షిశ్రీకి ఎదురుపడిన ఏ ఒక్కరిలోనూ తెల్లవారితే భోగి పండగ.. అనే సంతోషమే కనిపించ లేదు. గత ఏడాది సంక్రాంతి పండగకు చేతినిండా సొమ్ముతో హుషారుగా గడిపిన ఈ గ్రామంలో ఈసారి ఆ సరదాలే కరవయ్యాయనే ఆవేదనే ప్రతి ఒక్కరిలో కనిపించింది. వీకే రాయపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యవరపుపేటలో ఏడెనిమిది వందల గడప ఉంటుంది. అంతా ఎస్సీ, బీసీ వర్గాలే. చిన్నాచితకా కౌలు వ్యవసాయం చేస్తుంటే.. మూడు వంతుల మంది వ్యవసాయ కూలీలే. ప్రభుత్వం మారిన ఆరు నెలల్లో ఎంతో మార్పు వచ్చేసిందన్న ఆవేదన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. గడచిన ఆరు నెలల కూటమి పాలనను స్థానికులు బేరీజు వేసుకుంటున్న తీరు ఈ శ్రీవిలేజ్ విజిట్‌శ్రీ ప్రస్ఫుటంగా కనిపించింది
Comments
Please login to add a commentAdd a comment