వీడిన దాంపత్య బంధం
ఫ రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
ఫ భర్తకు తీవ్ర గాయాలు
తొండంగి: వారి పయనం అర్ధాంతరంగా ముగిసిపోయింది.. అనుకోని ప్రమాదం దాంపత్య బంధాన్ని విడదీసింది.. తొండంగి మండలం జాతీయ రహదారి బెండపూడి శివారు వై.జంక్షన్ వద్ద ఓ బైకును కారు ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు. కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన మార్తుర్తి వీరబాబు, అతని భార్య లక్ష్మిలు తమ బైక్‌పై బంధువులను పరామర్శించేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో బెండపూడి ఆర్చి వద్దకు వచ్చేసరికి వీరి బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో లక్ష్మి (35) తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన వీరబాబును 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె ధనలక్ష్మి ఉన్నారు.
వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా జాన్‌వెస్లీ
జగ్గంపేట: వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడిగా జగ్గంపేటకు చెందిన కుండా జాన్ వెస్లీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జాన్ వెస్లీకి పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
అదనపు ఎస్పీగా
మనీష్ దేవరాజ్
కాకినాడ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమిస్తూ ప్రభుత్వం సో మవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తొలుత గ్రే హౌండ్స్‌లో పని చేసిన అనుభవం ఉంది.
రెండు వర్గాల మధ్య ఘర్షణ
అంబాజీపేట: మోటారు సైకిళ్లు తప్పించే ప్రయత్నంలో రెండు సామాజిక వర్గాల మధ్య సోమవారం సాయంత్రం ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ముక్కామల జెడ్పీ హైస్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలు, గుండాల బరికి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఇరువర్గాలకు చెందిన యువ కులు మోటారు సైకిళ్లు తప్పించే ప్రయత్నంలో వివాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ విషయమై స్థానికులు అంబాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అక్కడ ఉన్నవారిని చెదరగొట్టారు. అలాగే కోడి పందేలు, గుండాలను నిలుపుదల చేయించారు. క్షతగాత్రులు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు లు అందలేదని ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. ఇదిలా ఉండగా ఘర్షణ సమయంలో పోలీస్ కానిస్టేబుల్ నియంత్రిస్తుండగా, అతనిపైనా యువకులు కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment