వీకే రాయపురంలో అక్కడక్కడ చిన్న సోడా కొట్లు, పచారీ దుకాణాలు, అటుకుల మిల్లులు కనిపించాయి. కానీ, గ్రామంలో మూడు వైపులా మూడు బెల్ట్ షాపులు మాత్రం దర్శనమిచ్చాయి. ఇది వరకు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరాన ఉండూరు రైల్వే జంక్షన్‌లో ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేది. దూరంగా ఉండటంతో మద్యపాన ప్రియులు రెండు రోజులకోసారి అక్కడకు వెళ్లి మద్యం తాగేవారు. మళ్లీ అంత దూరం వెళ్లలేక ఆగిపోయేవారు. అటువంటిది ఇప్పుడు ఈ గ్రామంలోనే నాలుగడుగులేస్తే బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. రోజంతా కష్టపడితే ఏడెనిమిది వందల రూపాయలు వస్తూంటే అందులో సగం మద్యానికి తగలేస్తున్నారని అప్పలకొండ తదితరులు ఆవేదనతో చెప్పారు.
వియ్ ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లిష్
సత్యవరపుపేట నుంచి తిరిగి వీకే రాయపురం సెంటర్‌కు వస్తూండగా మార్గం మధ్యలో ఇద్దరు చిన్నారులు కనిపించి హలో గుడాఫ్టర్‌నూన్ సార్ అంటూ చిరునవ్వుతో పలకరించారు. వీరు సత్యవరపుపేటకు చెందిన వ్యవసాయ కూలీలు పైలా తలుపులయ్య, రాణి దంపతుల కుమార్తెలు హాసిని, వేగవర్షిణి. ఈ ఇద్దరూ ఎంపీపీ స్కూల్‌లో 5, 3 తరగతులు చదువుతున్నారు. జగనన్న మా స్కూల్‌లో పిల్లలకు నేర్పించిన ఇంగ్లిషుతోనే ఇలా మాట్లాడుతున్నామని వారు చెబుతున్నప్పుడు వారి కళ్లల్లో ఒకింత ఆనందం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment