రాష్ట్రంలో క్రైం రేటు తగ్గింది
డీజీపీ ద్వారకాతిరుమలరావు
కాకినాడ క్రైం: రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని డీజీపీ ద్వారకాతిరుమలరావు వెల్లడించారు. సోమవారం ఆయన కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చారు. డిఐజీ అశోక్‌కుమార్ సహా జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ డీజీపీని సాదరంగా ఆహ్వానించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాదికి ఒక సంక్రాంతితోపాటు గంజాయి నియంత్రణ చర్యలు పటిష్టం చేశామన్నారు. మహిళలు, బాలలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొంటూ వాటి నియంత్రణ కోసం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోనున్నట్టు చెప్పారు. జిల్లా పోలీసుశాఖ పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు. గంజాయి రవాణా, నేరాల నియంత్రణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా డీజీపీ ఆయుధాగారాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment