బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బిక్కిన
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బిక్కిన విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. స్థానిక దేవాలయం వీధిలోని పైడా కల్యాణ మండలంలో మంగళవారం జరిగిన సమావేశంలో విశ్వేశ్వరరావు పేరును మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్నికల పరిశీలకుడు పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. 1994లో బీజేపీలో చేరిన బిక్కిన పార్టీకి ఎనలేని సేవ చేశారని, విద్యార్థి పరిషత్ నాయకునిగా, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యునిగా సేవలందించారని మాధవ్ చెప్పారు. బీజేపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారన్నారు. జిల్లాలోని 22 మంది పార్టీ మండల అధ్యక్షులు, 22 మంది ప్రతినిధులు జిల్లా అధ్యక్షుని ఎన్నికకు ఓట్లు వేశారని ఎన్నికల పరిశీలకులు కోడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లా అధ్యక్ష పదవికి బిక్కిన విశ్వేశ్వరరావు, రంభాల వేంకటేశ్వరరావు, గండి కొండలరావు, మట్టా మంగరాజు పోటీ పడ్డారన్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్తానని నూతన అధ్యక్షుడు విశ్వేశ్వరరావు చెప్పారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్, సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, యార్లగడ్డ రామ్‌కుమార్, కవికొండల భీమశంకర్, మాలకొండయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment