ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలి
కాకినాడ సిటీ: యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల నిర్ణయం ప్రకారం 12వ పీఆర్‌సీని వెంటనే నియమించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ నాయకులు మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె.వెంకట్రావుకు యూటీఎఫ్ వినతిపత్రం సమర్పించారు. 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగు, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు ఇవ్వాలని కోరుతూ వచ్చే నెలలో యూటీఎఫ్ కార్యాచరణ ఉంటుందన్నారు. తుని నియోజకవర్గం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు అందరికీ ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.రవి చక్రవర్తి, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కేవీవీ నగేష్, సహాధ్యక్షులు వీవీ రమణ, సహాధ్యక్షురాలు బి.నాగమణి, ట్రెజరర్ పీవీఎన్ గణేష్, జిల్లా కార్యదర్శులు టి.సీతారామయ్య, టి.రామలక్ష్మి, ఎ.సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment