ప్రయాగరాజ్‌కు మరో ప్రత్యేక రైలు నడపండి | - | Sakshi
Sakshi News home page

ప్రయాగరాజ్‌కు మరో ప్రత్యేక రైలు నడపండి

Published Tue, Jan 21 2025 2:17 AM | Last Updated on Tue, Jan 21 2025 2:17 AM

ప్రయాగరాజ్‌కు మరో  ప్రత్యేక రైలు నడపండి

ప్రయాగరాజ్‌కు మరో ప్రత్యేక రైలు నడపండి

కేంద్ర మంత్రి అశ్వినికి ఎంపీ శ్రీనివాస్‌ లేఖ

సాక్షి ప్రతినిధి,కాకినాడ: ప్రయాగరాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకు కాకినాడ టౌన్‌రైల్వేస్టేషన్‌ నుంచి అదనంగా మరో ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రం రైల్వేశాఖమంత్రి అశ్వినివైష్ణవ్‌కు ఈ మేరకు సోమవారం రాసిన లేఖ ప్రతులను ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. వచ్చే నెల 26 వరకు జరుగుతోన్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరువుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో కేంద్రమంత్రికి చేసిన విజ్ఞప్తితో కాకినాడ టౌన్‌ నుంచి ఫిబ్రవరి 20న ప్రయాగరాజ్‌కు నేరుగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ఈ ఒక్క రైలు జిల్లా నుంచి వెళుతోన్న భక్తుల రద్దీకి ఎంతమాత్రం సరిపోదని ఆ లేఖలో వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement