ఆధ్యాత్మికతను పెంపొందించాలి
పిఠాపురం: సమాజంలో ఆధ్యాత్మికతను పెంచడం ద్వారా అందరు సుఖ సంతోషాలతో జీవించడానికి కృషి చేయాలని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు సూచించారు. పిఠాపురంలో వేంచేసియున్న శ్రీపాదవల్లభ అనఘాదత్త క్షేత్రంలో వార్షికోత్సవాలలో పాల్గొన్న ఆయన బుధవారం ఆలయ ప్రాంగణంలో భక్తులతో అనఘాష్టమి వ్రతాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ ఉత్సవాల్లో ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. స్వామీజీలు శ్రీపాదవల్లభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కలశపూజ, వేద పారాయణ, గోపూజ, శ్రీచక్రార్చన, అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు, రుద్ర యాగ సహిత మహా గణపతి నవగ్రహ హోమం నిర్వహించారు. గురువారం కూడా అనఘాదత్త క్షేత్రంలో వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. స్వామీజీని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు.
మైసూర్ దత్త పీఠాధిపతి
గణపతి సచ్చిదానంద స్వామీజీ
Comments
Please login to add a commentAdd a comment