ముగిసిన శిక్షణ
సామర్లకోట: గిరిజన ప్రాంత అధికారులకు సీసా చట్టంపై రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ సద్వినియోగం చేసుకొవాలని విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ) ప్రిన్సిపాల్ జె వేణుగోపాల్ అఽన్నారు. పరిపాలనలో అవగాహన పెంచడానికి పీసా చట్టం, అటవీ హక్కుల చట్టంపై ఈటీసీలో రెండవ బ్యాచ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్బంగా వేణుగోపాల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల హక్కులను కాపాడటం కోసం గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ఆయా జిల్లాల్లో మండలాల వారీగా గిరిజన ప్రాంతాలలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఫిబ్రవరి 15 నుంచి అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రతీ మండలం నుంచి ఆరుగురు చొప్పున 202 మందికి రెండు బ్యాచ్‌లలో శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అంజేశారు. గురువారం నుంచి గిరిజన ప్రాంతాలలోని పంచాయతీ కార్యదర్శులకు నాలుగు బ్యాచ్‌ల్లో ఫిబ్రవరి 8వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఇ కృష్ణమోహన్, ఏపీఎస్‌ఐఆర్ పీఆర్ జాయింట్ డైరెక్టర్లు శ్రీదేవి, రమణ, డిప్యూటీ డైరెక్టరు రామనాధం, ఫ్యాకల్టీలు పి. శ్రీనివాసరావు, ప్రసాద్, చక్రపాణిరావు, బి ఆంజనేయులు, డీఆర్‌ఎన్ పద్మజ, కేఆర్ నిహారిక శిక్షణ తరగతులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment