జాబ్‌మేళా రేపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి కొండలరావు బుధవారం తెలిపారు. ఐటీఐలో ఏదైనా ట్రేడ్ పూర్తిచేసి 18 నుంచి 35సంవత్సరాల వయస్సులోపు గలవారు అర్హులని, ఇతర వివరాలకు 85008 85866 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
పారా అథ్లెటిక్
పోటీలకు ఎంపిక
కాకినాడ సిటీ: ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు చైన్నెలో జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ చాంఫియన్ షిప్‌లో పాల్గొనడానికి ఆసక్తిగల పారా అథ్లెటిక్ విభిన్న ప్రతిభావంతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేస్తామని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా సహాయ సంచాలకులు వీవీవీఎస్ లక్ష్మణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేసుకొని పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ఇతర వివరాలకు 93901 31777, 96524 58901, 91828 77433 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు
జిల్లా జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు అనంతపూర్ జిల్లా ఆర్డిటీ స్టేడియంలో జరిగే జూనియర్స్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపికను బుధవారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో నిర్వహించారు. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలను హాకీ సంఘ కార్యదర్శి నంబుశ్రీనివాసరావు ప్రారంభించారు. 25 మంది హాజరుకాగా 16 మందిని జట్టుకు ఎంపిక చేశారు. జట్టుకు కోచ్‌గా పి.లహరి, మేనేజర్‌గా లోకేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఈ ఎంపిక కార్యక్రమంలో డీఎస్‌ఏ హాకీ కోచ్ నాగేంద్ర, బాబ్జి, వి.గంగాధర్ పాల్గొన్నారు.
వాడపల్లి వెంకన్నకు
రూ.1.47 కోట్ల ఆదాయం
కొత్తపేట: Ðéyýl-ç³-ÍÏÌZ° }§ólÑ, ¿¶æ*§ólÑ çÜÐól$™èl Ðól…MýS-sôæ-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ BÌSĶæ$ çßæ$…yîlÌS §éÓÆ> Æý‡* 1,47,48,923 B§éĶæ$… Ð]l_a-¯]lr$t §ólÐ]l-§éĶæ$, «§ýlÆ>çéĶæ$ Ô>Q yìlç³NÅsîæ MýSÑ$-çÙ-¯]lÆŠæ, §ólÐ]l-Ý릯]l… DK ¯]lÌSÏ… çÜ*Æý‡Å^èl{MýS-«§ýlÆý‡-Æ>Ð]l# ™ðlÍ-´ëÆý‡$. 40 ÆøkÌS A¯]l…-™èlÆý‡… §ólÐ]l-§éĶæ$Ô>Q A«¨-M>-Æý‡$ÌS ç³Æý‡Å-Ðól-„ýS×æÌZ º$«§ýl-ÐéÆý‡… çßæ$…yîl-ÌS¯]l$ ™ðlÇ_ ¯]lVýS§ýl$, Ððl¬MýS$P-ºyýl$-ÌS¯]l$ ÌñæMìSP…^éÆý‡$. {糫§é¯]l çßæ$…yîlÌS ¯]l$…_ 1,20,88,369, A¯]l²-{ç³-Ýë§ýl… çßæ$…yîlÌS §éÓÆ> Æý‡* 22,38,344 çÜÐ]l$-MýS*Ç…§ýl-¯é²Æý‡$. º…V>Æý‡… 19 {V>Ð]l¬Ë$, Ððl…yìl 890 {V>Ð]l¬Ë$, ѧólÖ MýSÆð‡±Þ ¯ør$Ï 50 Ð]l_a¯]lr$Ï ÑÐ]lÇ…^éÆý‡$. AÌêVóS BÌSĶæ$ „óS{™èl´ë-ÌSMýS$yýl$ A¯]l²ç³NÆý‡~ çÜÐól$™èl ÑÔóæÓ-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ BÌSĶæ$ çßæ$…yîlÌS §éÓÆ> Æý‡* 4,22,210 B§éĶæ$… ÌSÀ…-_…-§ýl-¯é²Æý‡$. §ólÐ]l-§é-Ķæ$Ô>Q Æ>fÐ]l$-õßæ…-{§ýl-Ð]lÆý‡… C¯ŒSòܵMýStÆŠ‡ sîæÒG-‹Ü-BÆŠ‡ {ç³Ý맊æ, {VýS*ç³# §ólÐé-ÌS-Ķæ*Ë$ {VóSyŠæ &1 DK G¯ŒS-Ò-G¯ŒS-G‹ÜÒ {ç³Ýë-§ŠæÆ>-k, Vø´ë-ÌSç³#Æý‡… {VýS*ç³# §ólÐé-ÌS-Ķæ*Ë$ {VóSyŠæ & 3 DK ¼.MìSÆý‡×Šæ ç³Æý‡Å-Ðól-„ýS-×æÌZ Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS MýSÆý‡$r*Ç ¯]lÆý‡-íÜ…-àÆ>Ð]l#, Eç³ çÜÆý‡µ…^Œl ´ù_Æ>k »êº*-Æ>Ð]l# çÜÐ]l$-„ýS…ÌZ B§é-Ķæ*°² ÌñæMìSP…-^éÆý‡$. ˘
రుగ్వేద మహాసభలు ప్రారంభం
పి.గన్నవరం: ముంగండ గ్రామంలోని చింతామణి గణపతి మందిరంలో బుధవారం రుగ్వేద సంహిత పారాయణ, వేద విద్వత్ మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి సుమారు 70 మంది రుగ్వేద పండితులు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. రుగ్వేదాన్ని పరిరక్షించేందుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు ముంగండ ఆశ్వలాయన మహిర్షి రుగ్వేద పరిషత్ సభ్యులు తెలిపారు. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి సభాస్థలి వరకూ గ్రామ ప్రదక్షిణ జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వస్తి వాచనం, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వేద పురుష కలశస్థాపన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment