వైఎస్సార్ సీపీ నేత సోమరాజు మృతి
తుని రూరల్ : వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ పోలిశెట్టి సోమరాజు(76) మృతి చెందారు. గురువారం రాత్రి ఎస్.అన్నవరంలో స్వగృహంలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వద్దే చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఎస్.అన్నవరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 1992 నుంచి వరుసగా జరిగిన ఐదు ఎన్నికల్లో ఎస్.అన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడిగా ఎన్నికై రైతులకు విశేష సేవలు అందించారు. 30 సంవత్సరాలు పదవిలో కొనసాగిన ఆయన 2019 నుంచి డీసీసీబీ డైరెక్టర్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌వీవీ.కృష్ణంరాజు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్‌లు లాలం బాబ్జి, దూలం మాణిక్యం సోమరాజు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment