కుటుంబ సర్వేను త్వరగా పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
పెద్దకొడప్గల్/పిట్లం/మద్నూర్(జుక్కల్): ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. పిట్లం, మద్నూర్, పెద్ద కొడప్గల్ తహసీల్ కార్యాలయాల్లో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో జరుగుతున్న ఇంటింటి సర్వే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని వెంటనే కంప్యూటర్లో నమోదు చేయాలన్నారు. సర్వే వివరాలను ఆన్లైన్ చేసే ఆపరేటర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కంప్యూటర్లో నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment