మేయర్ కుటుంబానికే రక్షణ లేదు
ఖలీల్‌వాడి/నిజామాబాద్ అర్బన్: నగర మేయర్ కుటుంబానికే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్‌ను బిగాల మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. దాడులతో నగర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, బీఆర్‌ఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. దాడులను రాజకీయ పార్టీలు ప్రోత్సహించొద్దని హితవు పలికారు. ఆస్పత్రికి వచ్చిన బిగాలను చూసి మేయర్ నీతూకిరణ్ కంట తడిపెట్టగా ఆమెను బిగాల ఓదార్చారు. దండు శేఖర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నగర బీఆర్‌ఎస్ నాయకులు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
దాడి వెనుక ఉన్నవారిని శిక్షించాలి
దండు శేఖర్‌పై హత్యాయత్నం వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఈ మేరకు నాయకులతో కలిసి ఇన్‌చార్జి సీపీ సింధుశర్మకు ఫిర్యాదు చేశారు. దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామన్నారు. ఆయన వెంట మాలమహానాడు నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, ఎడ్ల నాగరాజు, అనంపల్లి ఎల్లం, అలుక కిషన్, అంగరి ప్రదీప్, నీలగిరి రాజు, నాంది వినయ్, స్వామి దాస్, సుశీల్ కుమార్, దేవీదాస్, బాలారాజు తదితరులున్నారు.
ఎంత పెద్ద వారున్నా శిక్షించాలి
సుభాష్‌నగర్ : మేయర్ భర్త దండు శేఖర్‌పై దా డి వెనుక ఎంత పెద్ద వారున్నా కఠినంగా శిక్షించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న శేఖర్‌ను ఆయన పరామర్శించారు. సమస్య ఏదైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తిగత దాడులకు దిగడం సరికాదన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ప్రవళిక –శ్రీధర్, నాయకులు భాస్కర్, మఠం పవన్, ఇందూరు సా యి, ముత్యాల సురేశ్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment