నేటి నుంచి కాలభైరవుడి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కాలభైరవుడి ఉత్సవాలు

Published Wed, Nov 20 2024 12:54 AM | Last Updated on Wed, Nov 20 2024 12:54 AM

నేటి నుంచి కాలభైరవుడి ఉత్సవాలు

నేటి నుంచి కాలభైరవుడి ఉత్సవాలు

రామారెడ్డి : కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఇసన్నపల్లి(రామారెడ్డి) కాలభైరవ స్వామి ఆలయం కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. ఐదు రోజులపాటు వైభవంగా స్వామివారి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో వేడుకలు మొదలవుతాయి. 72 గంటల పాటు స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహిస్తారు. గురువారం మధ్యాహ్నం బద్దిపోచమ్మ బోనాలు, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్షదీపార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన డోలారోహణం కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివస్తారు. అదేరోజు సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఉంటుంది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ప్రభు గుప్తా తెలిపారు.

ఇసన్నపల్లి(రామారెడ్డి) ఆలయంలో ఏర్పాట్లు

భారీగా తరలిరానున్న భక్తులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement