పచ్చ పురుగుతో పరేషాన్..!
బాల్కొండ : ప్రస్తుతం రబీ సీజన్‌లో సాగు చేస్తున్న మక్క, జొన్న పంటల్లో పచ్చ పురుగుతో అన్నదాతలు పరేషన్ అవుతున్నారు. జొన్న పంటకు విపరీతంగా పచ్చ పురుగు సోకుతోంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కత్తెర పురుగు పంటను కొన్నాళ్లు వెంటాడింది. ఆ పురుగు నివారణకు అన్నదాతలు చేయని ప్రయోగం లేదు. చివరికి బట్టలకు వాడే సరుపును కూడా వినియోగించారు. ప్రస్తుతం ఆ పురుగు కనిపించడం లేదు. కానీ పచ్చ పురుగు అధికంగా వెంటాడుతోంది. జొన్న పంటలో పురుగు నివారణకు ప్రస్తుతం రైతులు అనేక మందులు పిచికారి చేస్తున్నారు. కానీ పురుగు మాత్రం పోవడం లేదు. అంతే కాకుండా మరింత పెరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చ పురుగు మొగిలోకి చొచ్చుకుపోయి కాండం మొత్తం తినేస్తోంది. దీంతో మొక్క ఎదుగుదల ఆగి పోతోంది.
ఎన్ని మందులు పిచికారి చేసినా..
పెరుగు నివారణకు రైతులు ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం లేదని రైతులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఇష్టారీతిన పురుగు మందుల దుకాణాలు వెలిశాయి. రైతుల ఆందోళనను ఆసరగా చేసుకుని రైతుల నుంచి దండుకునేందుకు మందులను ఇస్తున్నారు. కానీ వఅవి పని చేయడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు సరైన సూచనలు చేస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ అలా చేయడం లేదు. కేవలం తూతూ మంత్రంగా పంటలను పరిశీలించి చేతులు దులుపుకొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పురుగుల నివారణపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పురుగు పోవడం లేదు
ప్రస్తుత సాగు చేస్తున్న జొన్న, మక్క పంటలో అ ధికంగా పచ్చ పురుగు వ్యాపిస్తోంది. ఎన్ని మందులు కొట్టినా పురుగులు మాత్రం పోవడం లే దు. వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. – బుల్లెట్ రాంరెడ్డి, రైతు
సాగవుతున్న జొన్న పంట
జొన్న, మక్క పంటలను
వెంటాడుతున్న వైనం
ఎన్ని మందులు చల్లినా లాభం
లేదంటున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment