కామారెడ్డి క్రైం: సన్న వడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా బీర్కూర్ రైతులతో మాట్లాడారు. బీర్కూర్ కొనుగోలు కేంద్రంలో ఉన్న పోశెట్టి, కిషోర్ అనే రైతులతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 2.34 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు మంత్రితో పేర్కొన్నారు. సన్న వడ్లు విక్రయించిన 1,152 మంది రైతులకు రూ. 4.3 కోట్ల బోనస్ జమ చేశామన్నారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్‌చార్జి డీఎస్‌వో నరసింహారావు, సహకార అధికారి రామ్మోహన్, రైతులు, సహకార సంఘాల చైర్మన్‌లు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment