మూగ జీవాల రోదన పట్టదా?
బాల్కొండ: వైద్యం కోసం అల్లాడుతున్న మూగ జీవాల రోదన పట్టదా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిఽధిలో పశు వైద్యుడు లేరు. దీంతో ఇన్‌చార్జి పశు వైద్యులే పశువులకు వైద్య అందిస్తున్నారు. మోర్తాడ్ మండల పశు వైద్యాధికారే మూడు మండలాలకు ఇన్‌చార్జి పశు వైద్యాధికారిగా కొనసాగుతున్నారు. అంటే నాలుగు మండలాలకు కలిపి ఒక్కరే పశువైద్యాధికారి దిక్కయ్యారు. ప్రస్తుతం చలికాలం సీజన్ ప్రారంభమైంది. ప్రధానంగా గొర్రెలలో, పశువులలో వింత జబ్బులు వ్యాప్తి చెందుతాయి. కానీ సకాలంలో వైద్యం అందించేందుకు వైద్యులు లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాల్కొండ మండలంలో బాల్కొండ, కిసాన్‌నగర్, ముప్కాల్ మండలంలో రెంజర్ల, మెండోరా మండల కేంద్రంలో పశు వైద్యశాలలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా పశువైద్యులు లేరు. దీంతో పశువులకు వైద్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా పశు వైద్యల పరిస్థితి మాత్రం మారడం లేదు. 317 జీవోలో బాల్కొండ, కిసాన్‌నగర్‌కు పశువైద్యులు వచ్చారు. దూరభారం ఎక్కువ కావడంతో తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
పశువులున్నా..
ఉమ్మడి బాల్కొండ(బాల్కొండ, ముప్కాల్, మెండోరా) మండలంలో పశువుల కొరత కూడా లేదు. 2017 పశుగణన ప్రకారం. ఎద్దులు 729, గేదేలు4152, గొర్రెలు 13354, మేకలు 4447, ముప్కాల్ మండలంలో ఎద్దులు 461, గేదెలు 2265, గొర్రెలు 8798 , మేకలు 1473, మెండోరా మండలంలో ఎద్దులు 622, గేదెలు 2714, గొర్రెలు 12984, మేకలు 2448 ఉన్నాయి. వీటన్నింటికీ వైద్యం అటెండర్ల ద్వారా మాత్రమే ప్రస్తుతం అందుతోంది.
ఉన్నతాధికారులకు నివేదించాం
పశు వైద్యుల కొరతపై ఉన్నతాధికారులకు ఇది వర కే నివేదించాం. జిల్లా సరిహద్దు కావడంతో ఎవరూ రావడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రస్తుతం కొనసాగుతోంది. – గౌతంరాజు,
ఇన్‌చార్జి పశు వైద్యాధికారి, బాల్కొండ
గాలిలో దీపంలా పశు వైద్యం
బాల్కొండ, ముప్కాల్, మెండోరా
మండలాల్లో పశు వైద్యాధికారి
పోస్టు ఖాళీ
ఇన్‌చార్జి వైద్యుడే దిక్కు..
పట్టించుకోని ప్రభుత్వాలు
Comments
Please login to add a commentAdd a comment