మద్యం మత్తులో యువత చిత్తు
మాచారెడ్డి: మద్యం మత్తులో నేటి యువతరం తేలుతోంది. మద్యం సేవించడం వారికి ఫ్యాషన్‌గా మా రినట్లు కనపడుతోంది. తాగి వాహనాలు నడుపు తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల పాల్వంచ మండల కేంద్రానికి ఓ యువకుడు మద్యం సేవించి మర్రి వైపు స్పీడుగా వెళ్తున్నాడు.
కొద్ది దూరంలో పోలీసులు వాహనాలను తని ఖీ చేస్తున్నారు. అప్పుడే పోలీస్ కానిస్టేబుల్ విజిల్ వేసి ఆ యువకుడిని ఆపేసి ఎస్సై వద్దకు పంపించా డు. బ్రీత్ అనలైజర్ పరికరంతో చెక్ చేయగా మ ద్యం సేవించినట్లు గుర్తించి జరిమానా వేశారు. మా చారెడ్డి మండలం ఓ గిరిజన తండాకు చెందిన 25 ఏళ్ల యువకుడు మద్యం సేవించి మండల కేంద్రం వైపు వెళ్తున్నాడు. వాహనాలను చెక్ చేస్తున్న పోలీ సులను చూసిన తొందరలో కింద పడి గాయాలై ఆస్పత్రి పాలయ్యాడు. మండలంలోని మరో గిరిజన తండాకు చెందిన యువకుడు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడి రెండు రోజులు జైలు పాలయ్యాడు. రాజ న్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు పనుల నిమిత్తం కామారెడ్డికి వెళ్తూ ఎక్కువ శాతం డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. జరిమానాలు చెల్లిస్తున్నారు కానీ మద్యం సేవించకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన యువకులు మద్యానికి బానిసై ఆ మత్తులో చిత్తవుతున్నారు. ఈ నెల రోజుల్లో 55 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టు బడుతున్నది ఎక్కువ శాతం 25 నుంచి 35 ఏళ్ల లోపు యువకులు కావడం విశేషం. పోలీసులు ఎన్ని సార్లు కౌన్సెలింగ్ చేసినా మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇటీవల అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతపై పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
హెల్మెట్ ధరించకుండా..
నూటికి 99 శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడుతూ జరిమానాలు చెల్లిస్తున్నారు కానీ హెల్మెట్ ధరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తు, పైగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ హెల్మెట్ ధారణపై ఇటు పోలీసులు, అటు స్వచ్ఛంద సంస్థలు వాహనదారులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న వారితో పాటు హెల్మె ట్ ధరించకుండా వాహనా లు నడుపుతున్న వారికి ప్ర తి రోజు అవగాహన కల్పిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ద్విచక్ర వాహనదారులు త ప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలు నడిపే ముందు ఒక్కసారి భార్యాపిల్లల్ని గుర్తు చేసుకోవాలి. – అనిల్, ఎస్సై, మాచారెడ్డి
నెల రోజుల్లో 55 డ్రంకెన్ డ్రైవ్ కేసులు..
ఒకరికి జైలు
పోలీసుల భయంతో ప్రమాదాలకు గురవుతున్న వైనం
అంతా 25నుంచి 35ఏళ్ల లోపు యువతే
Comments
Please login to add a commentAdd a comment