సమాచార లోపంతో ఇబ్బంది
కామారెడ్డి టౌన్ : విద్యాశాఖ ఇచ్చిన తప్పుడు సమాచారంతో డీఎస్సీ –2024 లో స్పోర్ట్ కోటాలో ఎంపికై న అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాకు చెందిన 19 మంది స్పోర్ట్స్ కో టాలో డీఎస్సీ–2024కు ఎంపికయ్యారు. వారి సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ఉంది. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉందంటూ అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. ఒర్జినల్ సర్టిఫికెట్లతో హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రభుత్వ కళాశాలలో హాజరు కావాలని సూచించారు. దీంతో అభ్యర్థులు అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడ్డారు. 21వ తేదీన పరిశీలన ఉండగా ఈరోజు ఎందుకు వచ్చారని అక్కడి అధికారులు పేర్కొనడంతో వెనుదిరిగారు. ఈ విషయమై డీఈవో రాజును ‘సాక్షి’ వివరణ కోరగా తమకు రాష్ట్ర అధికారుల నుంచి సరైనా సమాచారం లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు.
21వ తేదీన డీఎస్సీ స్పోర్ట్స్ కోటా
అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మంగళవారమే హాజరు కావాలంటూ జిల్లా విద్యాశాఖ నుంచి మెసేజ్
ఇబ్బందిపడ్డ అభ్యర్థులు
Comments
Please login to add a commentAdd a comment