నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిర్మన్‌పల్లికి చెందిన సాయిలు (24) కుటుంబ కలహాల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరిఫ్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గత కొన్ని రోజుల క్రితం సాయిలును ఆయన భార్య వదిలివెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిలు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధుడు..
భిక్కనూరు: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాచాపూర్ గ్రామానికి చెందిన సిద్దిపేట రాజిరెడ్డి (75) అనే వృద్ధుడు మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment