బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సమస్యలు పరిష్కరించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తెలంగాణాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ధర్మసమాజ పార్టీ గౌరవ అధ్యక్షుడు బాబు సాయికుమార్, మండల అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తాడ్వాయి తహసీల్దార్ రహిమొద్దీన్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీలకు వినతిపత్రాలను అందజేశారు. కేజీ నుంచి పీజీవరకు ఉచితంగా విద్యను అందించాలని, ప్రతి గ్రామంలో ఆస్పత్రిని నిర్మించాలని కోరారు. నేతలు నితిన్, ప్రవీణ్ తదితరులున్నారు.
క్రీడాకారులను
అభినందించిన జడ్జి
నిజామాబాద్‌నాగారం: తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో గచ్చిబౌలిలో నిర్వహించిన 38వ సబ్ జూనియర్ తైక్వాండో స్టేట్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల మంగళవారం అభినందించారు. అమెచ్యూర్ తైక్వాండో క్రీడాకారులు సహస్ర రాథోడ్ గోల్డ్ మెడల్, అవిరాజ్, ఆదితి, శుక్లా సిల్వర్ మెడల్ సాధించగా, సాయిప్రసన్న బ్రాంజ్ మెడల్, ఘన బ్రౌన్ మెడల్ సాధించారు. కోచ్ మనోజ్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంను
కలిసిన గడుగు
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర వ్యవసాయ కమి షన్ సభ్యుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు.మల్లుభట్టి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గడుగు గంగాధర్ ఆయను సన్మానించారు.
ప్రజలకు మెరుగైన
సేవలందించాలి
రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం సందర్శించారు. కార్యాలయాల పనితీరును పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, హాజరు, విద్యా బోధన, పరీక్షల నిర్వహణ తదితర వివరాలపై ఆరా తీశారు. జీపీ కార్యాలయంలో విద్య, పంచాయతీ రాజ్ పనితీరుపై సమీక్షించారు. బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సర్వే వివరాలను సబ్ కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఎంఈవో లోల శంకర్, పంచాయతీ అధికారి చందర్, హెచ్‌ఎం సాయిలు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment