జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల విద్యార్థి డి.రాహుల్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మాధవ రావు తెలిపారు. మంగళవారం అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్మల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడన్నారు. డిసెంబర్ 2 నుంచి 6 వరకు న్యూఢిల్లీలో జరిగే పోటీలకు తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. వైస్ ప్రిన్సిపాల్ రాహుల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు..
మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలోని ఆర్‌ఆర్ టాలెంట్ పాఠశాలకు చెందిన పృద్విజ అండర్–14 విభాగం బాలికల వాలీబాల్ పోటీలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి విజేతగా నిలిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళ వారం పృద్విజను అభినందించి గోల్డ్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. పీఈటీలు రామ్ రెడ్డి, సునీల్ రెడ్డి, సంతోష్, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులకు క్రీడా దుస్తులు, బూట్ల పంపిణీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడాపోటీలకు ఎంపికై న గోపాల్‌పేట హైస్కూల్ విద్యార్థులకు మంగళవారం గ్రామంలోని జేఎస్‌ఎం ఆస్పత్రి డాక్టర్ సంతోష్‌కుమార్ క్రీడా దుస్తులతోపాటు, బూట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబర్చి ఉన్నతస్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి, పీడీ సభాత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment