ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి
నిజామాబాద్ సిటీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, ఆమె సేవలను జాతి మరువదని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీభవన్‌లో మంగళవారం ఇందిరాగాంధీ 107వ జయంతిని నిర్వహించారు. ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ భవన్‌లో తాహెర్‌బిన్ మాట్లాడుతూ.. భారత దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపేందుకు ఎన్నో సాహసోపేత నిర్ణయాలను ఇందిర తీసుకున్నారన్నారు. బ్యాంకుల జాతీయకరణం, గరీబీ హఠా వో, హరిత విప్లవం, 20 సూత్రాల అమలు వంటిఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, సేవాదళ్ సంతోష్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, ఉష, మలైకా బేగం, విజయలక్ష్మి,ఽ ధర్మాగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాయిలు సంగెం, మాజీ మేయర్ సుజాత, అపర్ణ, సాయికుమార్ కుమార్, ముషు పటేల్, స్వప్న, ఆకుల మహేందర్ పాల్గొన్నారు.
సెల్‌ఫోన్‌ల అప్పగింత
నవీపేట: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు మంగళవారం అప్పగించామని ఎస్సై వినయ్ తెలిపారు. తమ మొబైల్ ఫోన్‌లు పోయినట్లు కొద్ది నెలల క్రితం 10 మంది బాధితు లు ఫిర్యాదు చేశారని, ఆధునిక పరిజ్ఞానంతో సీఈఐఆర్ ద్వారా ఫోన్‌లను రికవరీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment