సర్వే 80శాతం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో 80 శాతం పూర్తయ్యింది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వందశాతం సర్వేను పూర్తి చేసేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు హౌజ్ లిస్టింగ్ ని ర్వహించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇంటి యజమాని పేరు, ఫోన్ నంబరు, ఇంటి నంబరు సేకరించారు. స్టిక్కర్ మీద సీరియల్ నంబరు వేసి ఇంటి గోడలకు అతికించారు. జిల్లాలో 3,03,327 ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. హౌజ్ లిస్టింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఇంటింటి సర్వే మొదలయ్యింది. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఇళ్ల కు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికి 2,43,499 కుటుంబాల సర్వే పూర్తయ్యింది. మిగిలి న ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇవే కాకుండా అక్కడక్కడా మిగిలిపోయిన హౌజ్ లిస్టింగ్ కూడా చేపడుతున్నారు. వందశాతం సర్వేను పూర్తి చేసేందుకు క లెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎప్పటికప్పుడు అధికారుల తో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ ఏదో ఒక మండలానికి వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తున్నారు. అ దనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్‌తోపాటు మండలాల ప్రత్యేకాధికారులు కూడా సర్వేను పర్యవేక్షిస్తూ, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇస్తున్నారు.
2,366 మంది ఎన్యుమరేటర్లు..
సర్వేకోసం జిల్లాలో 2,366 మంది ఎన్యుమరేటర్లు, 237 మంది సూపర్‌వైజర్లను నియమించారు. సర్వేలో టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఐకేపీ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొంటున్నారు. సూపర్‌వైజర్లుగా 223 మందిని నియమించి, మరో 14 మందిని రిజర్వ్‌లో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 150 కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 125 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్‌ను కేటాయించారు. ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తయ్యింది. మిగిలిన ఇళ్ల సర్వే కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో నూరు శాతం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే సర్వేకు వెళ్లినప్పుడు చాలామంది ఆస్తులు, అప్పులు, వాహనాల వివరాలు చెప్పడం లేదని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. వ్యవసాయ భూములు, ఇతర వివరాలు మాత్రం ఇస్తున్నారని పేర్కొంటున్నారు.
సర్వేను బహిష్కరించిన కాయితీలు
ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడిగా ఆందోళనలు చేస్తున్న కాయితీ లంబాడీలు (లబాన్) సర్వేను బహిష్కరించారు. రాష్ట్రంలో ప్రధానంగా జిల్లాలోని గాంధారి, లింగంపేట, పెద్దకొడప్‌గల్, పిట్లం తదితర మండలాల్లో వేల సంఖ్యలో కాయితీ లంబాడీలున్నారు. వీరు బీసీలలో ఉండడంతో విద్య, రాజకీయ పరంగా నష్టపోతున్నారు. ఎస్టీలలో చేర్చాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఏళ్లుగా తమ సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదనతో వారు సర్వేను బహిష్కరించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం కాయితీ లంబాడీలు ఎదురు చూస్తున్నారు.
త్వరలో డాటా ఎంట్రీ..
కుటుంబ వివరాలను సేకరిస్తున్న ప్రభుత్వం వాటిని పొందుపరిచేందుకు ప్రత్యేక యాప్ రూపొందిస్తోంది. రెండు మూడు రోజుల్లో యాప్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఆన్‌లైన్ నమోదు కోసం ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. యాప్ వచ్చిన తర్వాత సర్వేలో సేకరించిన కుటుంబాల వివరాలన్నింటినీ అందులో నమోదు చేయనున్నారు. 56 కాలమ్స్‌లో ఉన్న 76 ప్రశ్నలకు సంబంధించిన పూర్తి సమాచారం అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే సర్వే వివరాలు యాప్‌లో నమోదు చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.
జిల్లాలో 3,03,327
కుటుంబాల గుర్తింపు
ఇప్పటివరకు 2,43,499
కుటుంబాల సర్వే పూర్తి
ఇంటింటికి వెళ్లి వివరాలు
సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు
ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై
సిబ్బందికి శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment