మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్‌

Published Wed, Nov 20 2024 12:53 AM | Last Updated on Wed, Nov 20 2024 12:53 AM

మున్న

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్

కామారెడ్డి టౌన్‌: జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పట్టణ మున్నూరు కాపు సంఘం భవనంలో జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సంఘం ప్రతినిధి నీలం లింగం వ్యవహరించారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోటీలో నిలిచిన ఆకుల శ్రీనివాస్‌కు 38 ఓట్లు రాగా.. నీలం నర్సింలుకు 5 ఓట్లు, అన్మాల గంగయ్యకు 3 ఓట్లు వచ్చాయి. అత్యఽధిక ఓట్లు సాధించిన ఆకుల శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం నూతన అధ్యక్షుడి తో ప్రమాణస్వీకారం చేయించారు.

అన్ని రంగాల్లో రాణించాలి

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలని ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బా ల్‌రాజ్‌ సూచించారు. ఈ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న ము న్నూరుకాపుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మా నించారు. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయు లు, సంఘం మాజీ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, మహిళా అధ్యక్షురాలు లత, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

‘మహిళలకు అవకాశమిస్తే

అన్నిరంగాల్లో రాణిస్తారు’

కామారెడ్డి అర్బన్‌: మహిళలకు అవకాశమిస్తే అన్ని రంగాల్లో రాణించగలరని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ సంస్థ వారోత్సవాల్లో భాగంగా మంగళవా రం విద్యార్థులు, మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి మహిళల ప్రతిభను అభినందించారు. వేసిన ముగ్గులను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రజిత, వైద్యులు రాజ్యలక్ష్మి, మాధవి, అనూష, రిహాన, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉరుదొండ వనిత, కౌన్సిలర్‌ మాడూరి అనూష తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వయంకృషి తో ఎదగడంతో పాటు పోటీపరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రజిత సూచించారు. అతిథులుగా పాల్గొన్న వారిని చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి సన్మానించారు.

‘ఉత్తమ ఫలితాలు

సాధించాలి’

సదాశివనగర్‌: ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. కళాశాలకు రోజూ విద్యార్థి హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అజ్మల్‌ఖాన్‌, లెక్చరర్లు పాల్గొన్నారు.

మేయర్‌ భర్తపై

దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

ఖలీల్‌వాడి (నిజామాబాద్‌ అర్బన్‌) : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాగారం 80 క్వార్టర్స్‌ వద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ దండు నీతూ కిరణ్‌ భర్త దండు శేఖర్‌పై దాడి చేసిన షేక్‌ రసూల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం సాయంత్రం దండు శేఖర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు నాలుగు బృందాలతో గాలించి నిందితుడిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మున్నూరు కాపు సంఘం జిల్లా  అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్1
1/2

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్

మున్నూరు కాపు సంఘం జిల్లా  అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్2
2/2

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement