అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యత
కామారెడ్డి క్రైం : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభా రతి ఆడిటోరియంలో మంగళవారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించా రు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం మహిళాశక్తి కార్యక్రమం కింద మైక్రో ఎంటర్‌ప్రైజెస్, పాడి పరిశ్రమ, క్యాంటీన్‌ల నిర్వహణలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. జి ల్లాలో 423 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి మద్దతు ధరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. ప్రభుత్వం సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం అంతడుపుల నాగరాజు కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 75 మంది కళాకారులు కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వి.విక్టర్, బాన్సువాడ స బ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో రంగనాథ్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రచార వాహనాల ప్రారంభం
ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆడిటోరియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార రథాలు గ్రామాలకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తాయన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ రగడ
విజయోత్సవాలు ప్రారంభం కాకముందే ప్రొ టోకాల్ వివాదం రాజుకుంది. కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం ముందుగా ఓ ఫ్లెక్సీని ఆర్డర్ చేసింది. దాంట్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫొటో లేకపోవడంతో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకు లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదనపు కలెక్టర్ విక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి వెంటనే ఫ్లెక్సీలో షబ్బీర్ అలీ ఫొటో పెట్టించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు శాంతించారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment