అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి
కామారెడ్డి క్రైం: సీడీపీవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల హాజరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పిల్లల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి అవసరమైతే న్యూట్రిషియన్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. పిల్లలకు బాలామృతం, పాలు, గుడ్లు ఇతర పౌష్టికాహారం అందించాలన్నా రు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న వాటిని వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. కల్టెరేట్‌లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వారందరికీ బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఈఈలు దుర్గాప్రసాద్, ఆంజనేయులు, డీఈఈలు, ిసీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం
అందేలా చూడాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment