దేశమంతా బీజేపీకి ఆదరణ
కామారెడ్డిక్రైం: దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డిలో ఎమ్మెల్యే సమక్షంలో పలువురు యువకులు బీజేపీలో చేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, జార్ఖండ్లలో కమల వికాసం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్క ఏడాదికే కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చకపోవడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలోని అన్ని స్థానాలను బీజేపీ కై వసం చేసుకునేలా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల భరత్, మోటూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మినీ గురుకుల పాఠశాల తనిఖీ
మాచారెడ్డి : మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల మినీ గురుకుల పాఠశాలను గురువారం ఉదయం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికన్నా ముందే పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే.. టీచర్లు, విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? టీచర్లు సక్రమంగా వస్తున్నారా? పాఠాలు బోధిస్తున్నారా? అంటూ విద్యార్థినులను ప్రశ్నించారు. ఏ సమస్య ఉన్నా నిరభ్యంతరంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజనం గురించి వాకబు చేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని హెచ్ఎం వెంకటాచారికి సూచించారు.
ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment