సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై తిరుగుబాటు చేశారు. నియోజక వర్గంలోని ఆయా మండలాలకు చెందిన కొందరు నాయకులు గురువారం గాంధీభవన్‌కు తరలివెళ్లారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై పలు ఆరోపణలు చేస్తూ పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటన విడుదల చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న వారిని వదిలి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని, మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ వసూళ్లు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, నిజాంసాగర్, మద్నూర్, పెద్ద కొడప్‌గల్ మండలాలకు చెందిన పలువురు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు సౌదాగర్ అరవింద్, కమల్ కిషోర్, వినోద్, సంగమేశ్వర్, జయప్రదీప్, పాటిల్ లక్ష్మణ్, మాణిక్‌రావు, సురేశ్, మొగులయ్య, లక్ష్మీబాయి, ఎం గంగారాం, కె శంకర్, హన్మాండ్లు తదితరులు గాంధీభవన్‌కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వైఖరిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి మూలంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మురిగిపోయాయని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేతలకు కనీస గౌరవం ఇవ్వకపోవడమే గాకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆరోపించారు.
గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగిన నేతలు
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment