‘మూడు రోజుల్లో సర్వే పూర్తవ్వాలి’
కామారెడ్డి క్రైం : జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మూడు రోజుల్లో పూర్తి చేచేసి డాటా ఎంట్రీ ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో మాట్లాడారు. ఇంటింటి సమగ్ర సర్వేలో సేకరించిన వివరాల ఫారాలను భద్రపరచాలన్నారు. డాటా నమోదు కోసం అవసరమైన కంప్యూటర్ ఆపరేటర్లు, సహాయకులను నియమించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 96.3 శాతం ఎన్యుమరేషన్ పూర్తయ్యిందన్నారు. 11 మండలాల్లో వంద శాతం ఎన్యుమరేషన్ పూర్తయ్యిందని తెలిపారు. మిగతా మండలాల్లో రెండు, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. డాటా ఎంట్రీని ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కింద వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్‌లు పరిశీలించాలన్నారు. లాగిన్‌లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, సీపీవో రాజారాం తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment