లక్ష ్యం సగమే..!
దోమకొండ : మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం ఏటా వందశాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఈసారి చేపపిల్లల సరఫరా తగ్గిపోవడంతో తమ ఉపాధిపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో చేపల పెంపకంపై మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ప్రభుత్వం మత్స్య పారిశ్రామిక సహకార శాఖ ద్వారా ఏటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చే స్తోంది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియకు టెండర్లు ఆహ్వానించింది. కానీ గతేడాది బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్‌లు ముందుకు రాలేదని తెలిసింది. జూ లై నుంచి సెప్టెంబర్ వరకు పలుమార్లు టెండర్లు పి లిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు.
ఇతర జిల్లాల నుంచి తెప్పించాం
జిల్లాలో చేపపిల్లల పంపిణీకి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు రాలేదు. దీంతో ఇతర జిల్లాల నుంచి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీని వల్ల పంపిణీ లక్ష్యం తగ్గిపోయింది. అయితే ఈసారి 82 ఎంఎం సైజ్‌గల చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నందున మత్స్యకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి త్వరగా ఎదుగుతాయి.
– శ్రీపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి
జిల్లాలో గతేడాది 2.80 కోట్ల
చేపపిల్లల పంపిణీ
ఈసారి 1.40 కోట్లకు తగ్గించిన
అధికారులు
ఇప్పటివరకు వదిలింది 1.05 కోట్లే..
ఆందోళన చెందుతున్న మత్స్యకారులు
Comments
Please login to add a commentAdd a comment