ఎల్లారెడ్డిలో 2కే రన్
ఎల్లారెడ్డి : బజరంగ్‌దళ్ దేశవ్యాప్తంగా తలపెట్టిన న షా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవా రం ఎల్లారెడ్డిలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమా న్ని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు పరు గు సాగింది. అనంతరం గాంధీచౌక్ వద్ద పట్టణ ప్ర జలు, విద్యార్థులు, నాయకులు మానవహారంగా ఏర్పడి మత్తు పదార్థాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ మత్తు పదార్థాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ రవీంద్రనాయక్, ఎస్సై మహేష్, జి ల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్, కాంగ్రెస్ నాయకుడు విద్యాసాగర్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు పీకే నరే ష్, వినోద్ కుమార్, తులసీదాస్, భరత్, రాహుల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment