నాలుగో విడతలోనూ నిరాశ!
మోర్తాడ్(బాల్కొండ)/ఇందల్వాయి: వివిధ కారణాలతో రూ.2 లక్షల లోపు రుణం మాఫీ కాని వారికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి మాఫీ సొమ్మును మహబూబ్‌నగర్ వేదికగా విడుదల చేశారు. అ యితే అనేక మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ జ మకాకపోవడంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలో గతంలో మూడు విడతల్లో 83,061 మంది రైతులకు రూ.626.49 కోట్లను విడుదల చేయగా నాలుగో విడతలో రూ.155.81 కోట్లను 17,551 మంది రైతులకు మంజూరు చేశారు. రుణమాఫీ ఫలాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 2లక్షల మందికి పైగానే ఉంటుందని అంచనా. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోను అనేక మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో 39,285 మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తులు అందించారు. ఇదిలా ఉండగా దరఖాస్తుల్లో ఒకే కుటుంబం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయని, అలాంటి వారిని కలిపితే రెండు లక్షలకు మించి రుణం ఉన్న కేటగిరిలోకి వారు వెళ్లడంతో దరఖాస్తుల సంఖ్యకి లబ్ధిదారుల సంఖ్యకి తేడా ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
అర్హత ఉన్నా అందని రుణమాఫీ..
రెండు లక్షలలోపు ఉన్నా లోనే ఉన్నా
మాఫీ కానీ వైనం
ఆందోళన చెందుతున్న రైతులు
ప్రభుత్వం మాట తప్పింది...
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. గతంలో ఏక కాలంలోనే రూ.2 లక్షల వరకు పంట రుణం మాఫీ అని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు సంమంజసం. ప్రభుత్వం రైతులను వంచించడం సరికాదు. వెంటనే రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
– ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్
రైతులు కంగారు పడొద్దు
రూ. రెండు లక్షలలోపు పంట రుణాలు ఉండి ఇంకా రుణమాఫీ కానీ రైతులు కంగారు పడవద్దు. అన్ని రకాల ధ్రువపత్రాలతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. వారు దరఖాస్తులు స్వీకరించి వ్యవసాయ శాఖకు నివేదిస్తారు. అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా వ్యవసాయ శాఖ కృషి చేస్తుంది.
– ప్రదీప్ కుమార్, ఏడీఏ, నిజామాబాద్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment