పారామెడికల్ కళాశాల ప్రారంభం
కామారెడ్డి టౌన్: కామారెడ్డిలో పారామెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో కామారెడ్డి మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన పారామెడికల్ కళాశాలను ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వర్చువల్ విధానంలో ప్రారంభించిన
సీఎం రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment