పూలే విగ్రహం వద్ద అక్షరాభ్యాసం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సావిత్రిబాయి పూలే జ యంతి సందర్భంగా శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దనున్న పూలే దంపతుల విగ్రహాల ముందు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏటా సావిత్రిబాయి పూలే జయంతి రోజున సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలని నిర్ణయించారు. సావిత్రిబాయి పూలే జ యంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రక టించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, న్యాయవాది క్యాతం సిద్దరాములు, బామ్‌సెఫ్ రాష్ట్ర కార్యదర్శి న రేందర్, అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆ కుల బాబు, జిల్లా అధ్యక్షుడు గంగారాం, వివిధ సంఘాల నేతలు ఎల్‌ఎన్ ఆజాద్, జీవీఎం విఠల్, అరవింద్, ముదాం అరుణ్, శివరాములు, రాజ య్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
హర్షణీయం..
సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర పండుగగా, మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గతేడాది ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment