‘ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి’
కామారెడ్డి టౌన్: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారం 26వ రోజు కొనసాగింది. ఉద్యోగు లు మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా తరలివెళ్లి నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. గంట పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పంజాబ్, హర్యానా, సిక్కిం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించారన్నారు. అక్కడ సాధ్యమైన క్రమబద్ధీకరణ తెలంగాణలో ఎందుకు కాదో సీఎం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. బీడీఎస్‌ఎఫ్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శులు ఆజాద్, విఠల్ సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ మహిళా అధ్యక్షురాలు వాసంతి, ప్రధాన కార్యదర్శి సంపత్, ప్రతినిధులు సంతోష్‌రెడ్డి, రాములు, వనజ, రమేష్, శ్రీవాణి, శైలజ, కాళిదాసు, వీణ, చిరంజీవి, కృష్ణ, శ్రీనివాస్, మాధవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment