‘విద్యుత్ లైన్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలి’
కామారెడ్డి అర్బన్: గాలి పటాలను మైదానాల్లో విద్యుత్ లైన్లకు దూరంగా ఎగురవేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో సూచించారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తుండడంతో విద్యుత్ లైన్లపై పడి తరచు ప్రమాదాలు జరగుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లపై గాలిపటాలు పడిపోయినప్పుడు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే తమ సిబ్బంది వచ్చి ప్రమాదం జరగకుండా వాటిని తొలగిస్తారని తెలిపారు. గాలిపటాలను ఎగురవేయడానికి చైనా మాంజా వినియోగించవద్దని సూచించారు.
11 నుంచి టెక్నికల్
సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
కామారెడ్డి అర్బన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 11వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు డీఈవో రాజు ఒక ప్రకటనలో తె లిపారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్య ర్ గ్రేడ్ పరీక్షలను ఈనెల 11, 12, 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్య ర్థులు అన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ అభ్యర్థులు పరీక్షలకు కు ట్టు మిషన్, టేబుల్, కత్తెర తదితర సామగ్రి ని వెంట తీసుకుని రావాలని తెలిపారు.
సెపక్‌తక్రా
రాష్ట్ర కోచ్‌గా నరేశ్
కామారెడ్డి అర్బన్: సెపక్‌తక్రా రాష్ట్ర కోచ్‌గా సెపక్‌తక్రా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నరేశ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, సెపక్‌తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ తెలిపారు.
ఇందిరమ్మ సర్వే పరిశీలన
బిచ్కుంద: మండల కేంద్రంలో సోమవారం హౌజింగ్ జిల్లా అధికారి విజయ్‌పాల్‌రెడ్డి, డీ ఈ గోపాల్ ఇందిరమ్మ సర్వేను పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స ర్వే సిబ్బంది వేగం పెంచి గడువులోగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ హన్మంతు, ఎంపీడీవో గోపాల్, కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
‘శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు’
కామారెడ్డి క్రైం: వివాదాల్లో తలదూర్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని ఏ ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులకు సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎలాంటి తగాదాలలో తలదూర్చవద్దని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
గురుకులాల్లో
ప్రవేశాలకు దరఖాస్తులు
డిచ్‌పల్లి: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనకబడిన తరగతుల సంక్షే మ, సాధారణ గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 5 నుంచి 9 తర గతులలో ప్రవేశాలకోసం టీజీసెట్ – 2025 నిర్వహించనున్నారు. ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జోనల్ –2 ఆఫీసర్ ఫ్లోరెన్స్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాలలో ఏడాదికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ. 1.50 లక్షలలో పు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.tswreis.ac.in లేదా http:// tgcet. cgg.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల 23న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చేనెల ఒకటో తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment