కామారెడ్డి క్రైం: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నమోదైన 71 కేసుల్లో రూ.7.98 కోట్ల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి హన్మంతరావ్ తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి, అల్ప్రాజోలం, డైజోఫామ్, గంజాయి మొక్కలను సోమవారం జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామంలోని శ్రీమెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో దహనం చేశామని పేర్కొన్నా రు. 1,285.25 కిలోల ఎండు గంజాయి, 32.585 కిలోల అల్ప్రాజోలం, 71.845 కిలోల డైజోఫామ్, 114 గంజాయి మొక్కలను దహనం చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు విజయ్ కుమార్, మధుసూదన్‌రావ్, షాకీర్ హైమద్, సత్య నారాయణ, ఎస్సై విక్రమ్ కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment