భవానీపేట పల్లె దవాఖానాకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

భవానీపేట పల్లె దవాఖానాకు గుర్తింపు

Published Tue, Jan 7 2025 1:38 AM | Last Updated on Tue, Jan 7 2025 1:38 AM

-

మాచారెడ్డి: పాల్వంచ మండలంలోని భవానీపేట పల్లె దవాఖానాకు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌(ఎన్‌క్యూఏఎస్‌) సర్టిఫికేషన్‌ లభించింది. ఈ విషయాన్ని మాచారెడ్డి మండల వైద్యాధికారి ఆదర్శ తెలిపారు. ఇటీవల ఎన్‌క్యూఏఎస్‌ బృందం ఆస్పత్రిని తనిఖీ చేసిందని పేర్కొన్నారు. పల్లె దవాఖానాలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకుగానూ ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. ఎన్‌క్యూఏఎస్‌ గుర్తింపు రావడానికి కృషి చేసిన సీహెచ్‌వోలు వేంకటేశ్వరరావు, శ్రీకాంత్‌, ఏఎన్‌ఎంలు రాజమణి, సుమలత, సిబ్బందిని అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement